ETV Bharat / snippets

తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు - స్వాగతించిన కేటీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 3:07 PM IST

KTR Speech in Assembly
Telugu University is named after Suravaram Pratapa Reddy (ETV Bharat)

KTR about Suravaram Pratapa Reddy : తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీలో కేటీఆర్ స్వాగతించారు. సురవరం ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్‌కు ఎనలేని గౌరవమని, అందుకే గతంలో ఆయన పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వం తెస్తామన్న స్పోర్ట్స్ పాలసీకి తాము మద్దతిస్తామన్న కేటీఆర్ సలహాలు, సూచనలు కూడా ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తాము ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను బాగు చేసి, వాటిని కొనసాగించాలని కోరారు. తెలంగాణలో మహానుభావులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి ఉందన్న ఆయన, హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నర్సింహారావు పేరు పెట్టామని గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.