Bomb Squad Inspects Neighborhood of Tankbund : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ట్యాంక్ బండ్‌పై ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అణువణువు జల్లెడ పట్టారు.
మరోవైపు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ఈ ప్రాంతమంతా పచ్చదనం పరుచుకునేలా కొత్తగా మొక్కలు నాటడం, పచ్చిక ఏర్పాటు పనులు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు.