BJP state In-charge controversy in Telangana: తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా అభయ్ పాటిల్ నియామకం జరగలేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటన విడుదల చేశారు. మరోవైపు అభయ్ పాటిల్ మాట్లాడుతూ, జాతీయ నాయకత్వం ఆదేశిస్తేనే తాను నమోదు కార్యక్రమానికి వచ్చానని అన్నారు. పార్టీ ఎక్కడికి పంపినా నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్‌ను ఇటీవల జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం సంస్థాగత ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్ కొనసాగుతున్నారు. తరుణ్ చుగ్ స్థానంలో అభయ్ పాటిల్‌ను అధిష్ఠానం నియమించిందని సమాచారం. పార్టీ వెబ్‌సైట్ సైతం దీనికి ఉదాహరణగా నిలిచింది. జాతీయ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మీడియాతో కిషన్ రెడ్డి చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
రచ్చ లేపుతున్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వివాదం
Published : Aug 22, 2024, 12:30 PM IST