Minister Konda Surekha Phone: ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ దామరవాయి అటవీ కార్యాలయంలో సిబ్బందిపై దాడి జరిగింది. ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. ఈ దాడికి సంబంధించి పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్) డోబ్రియాల్ మంత్రికి ఫోన్‌లో వివరించారు. గురువారం అర్ధరాత్రి దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు తొలగించి, నేల చదును చేస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన అధికారులు వినోద్, శరత్‌చంద్ర, సుమన్లు జేసీబీని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో జేసీబీ కోసం అక్కడికి వచ్చిన నిందితులు అటవీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. తర్వాత జేసీబీని తీసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా గార్డియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అటవీ అధికారులు వినోద్, శరత్‌చంద్రలతో మంత్రి సురేఖ ఫోన్‌లో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
అటవీ అధికారులపై దాడి - ఆరా తీసిన మంత్రి కొండా సురేఖ
Published : Sep 27, 2024, 3:16 PM IST