White Paper on Power Department: రాష్ట్ర ప్రభుత్వం.. ఇంధనశాఖపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది? అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్తు రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది? అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది? వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇంధనశాఖపై నేడు ప్రభుత్వం శ్వేతపత్రం - వివరాలు వెల్లడించనున్న సీఎం చంద్రబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 9:04 AM IST