AP Assembly Sessions Notification Released: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం ప్రశ్నోత్తరాలు, శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
22 నుంచి అసెంబ్లీ సమావేశాలు - నోటిఫికేషన్ విడుదల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 3:03 PM IST
|Updated : Jul 19, 2024, 5:18 PM IST