Agniban Rocket Launch postponed : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా నిర్వహించే అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రైవేట్ ప్రయోగ వేదికగా ఇవాళ (మే 28న) నింగిలోకి వెళ్లాల్సిన అగ్నిబాణ్ రాకెట్ వాయిదా పడింది. అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఆ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఈ రాకెట్ రికార్డుకు కెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇందులో ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం వాయిదా - కారణం ఇదే?
Published : May 28, 2024, 7:01 PM IST