ETV Bharat / snippets

అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు - తప్పిన పెను ప్రమాదం

SCHOOL BUS ACCIDENT
SCHOOL INTO CANAL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 1:24 PM IST

A School Bus Crashed into a Crop Canal : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అవంతిపురం వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలోని వీవీఆర్ సిటీ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సులో అవంతిపురంలోని దేవాలయాలను దర్శించుకుని తిరిగి వస్తుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పంట కాలువలోకి దూసుకెళ్లింది.

డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్టుగా స్థానికులు తెలిపారు. ఘటన జరిగి రెండు గంటల సమయం అవుతున్నా స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంతో గాయపడిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.