Minor Girl Raped in Peddapalli District : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘటన సుల్తానాబాద్ మండల పరిధిలో జరిగింది. గురువారం అర్ధరాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని అందులో డ్రైవర్‌గా పనిచేస్తున్న డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాలిక కనపడకపోవడంతో గమనించిన తల్లి తోటి కార్మికులకు ఈ విషయాన్ని తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.