Nizamabad Railway Track Incident: నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం రైల్వేగేటు వద్ద హంగామా చేశాడు. రైల్వే పట్టాలపై ప్రమాదకరంగా రాళ్లను పెట్టాడు. అనంతరం రైల్వే ట్రాక్‌పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మల్టీ రైల్ ఇంజన్ వచ్చింది. లోకో పైలట్ యువకుడిని గమనించి వెంటనే మాధవనగర్ గేట్మెన్కు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే గెట్మెన్ రాజు యువకుడి వద్దకు వెళ్లగా అతడు వాగ్వాదానికి దిగాడు. గేట్‌పై రాళ్లు విసిరాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. యువకుడి నిర్వాకంతో గేటు వద్ద కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ మధ్య రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, రాళ్లు లాంటివి కొంతమంది ఆకతాయిలు పెడుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రజారవాణాకు కొంత ఆందోళన కలిగించేవే.
రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి వింత చేష్టలు- రాళ్లను వరుసగా ట్రక్‌పై పెట్టి గేట్‌మెన్‌తో గొడవ
Published : Sep 26, 2024, 4:18 PM IST