Cheating in Quthbullpur: కుత్బుల్లాపూర్‌లో చిట్టీల పేరుతో 34 మందిని మోసం చేసి రూ.4కోట్ల 70లక్షలతో పరారయ్యారు. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే మేకల నాగమునెయ్య, ఆయన భార్య నాగమణి, సమీప బంధువులు చేకూరి రంగ నాయకులు, గురుస్వామి గత 15 ఏళ్లుగా బాలానగర్ చింతల్ వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉండేవారు. నాగమణి ఆమె కుటుంబం అందరూ కలిసి 6చిట్టీ గ్రూపులు నిర్వహించేవారు. 2022లో నాగమణి తన దగ్గర చిట్టీలు వేసే ఓ మహిళ నుంచి రూ.40లక్షల 85వేల రుణం తీసుకుంది.
ఏడాది గడిచినా తీసుకున్న అప్పు, చిట్టీ డబ్బు ఇవ్వలేదు. మొత్తం 35 మంది నుంచి రూ.4కోట్ల 70లక్షలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు గుర్తించారు. బాధితుల్లో ఒక్కొక్కరూ రూ.10లక్షల కంటే ఎక్కువ మోసపోయినవారే ఉండడం గమనార్హం. పోలీసులు ఆ నలుగురి మీద కేసు నమోదు చేశారు. బాధితులందరూ తమకు న్యాయం జరగలా చూడాలని నాగమణి ఇంటిముందు నిరసన తెలిపారు.