Gandikota Koneru Dried Up in YSR District : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వైఎస్సార్ జిల్లాలోని గండికోటలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటలో ఈ కోనేరూ అంతే పురాతనమైంది. తమ తాతముత్తాతల కాలం నుంచి ఈ కోనేరు ఎండిపోయిన ఆనవాళ్లు చూడలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరవు పరిస్థితులకు ఈ కోనేరు అద్దం పడుతోందని తెలిపారు. ఈ విషయమై జిల్లా పురావస్తుశాఖ అధికారి బాలకృష్ణను వివరణ కోరగా వర్షాభావంతో కోనేరులో నీరు ఎండిపోయిందని, పూడికతీత, మరమ్మతు పనుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తామని అన్నారు.
'గండికోట' ఎండిపోయింది- 900 ఏళ్లలో ఇదే తొలిసారి అంటున్న గ్రామస్థులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 10:22 AM IST