ETV Bharat / snippets

ట్యూషన్​కు వెళ్లిన బాలుడు అదృశ్యం - 4 బృందాలతో పోలీసుల గాలింపు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 10:20 AM IST

Updated : Aug 5, 2024, 2:27 PM IST

8 year Old boy Missing
8 year Old boy Missing (ETV Bharat)

8 year Old boy Missing : రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న బాలుడి అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ట్యూషన్​కు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాలేదు. అతని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వెతికారు. ఎంతకీ బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మీర్​పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం బాబు ద్విచక్రం వాహనంపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. మీర్ పేట్ జంక్షన్​లో బస్టాప్ వద్ద ద్విచక్రం వాహనం దిగినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బస్టాప్ నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది.

Last Updated : Aug 5, 2024, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.