ETV Bharat / snippets

ఫైనల్​కు దూసుకెళ్లిన కివీస్- సెమీస్​లో విండీస్ ఓటమి

WI VS NZ
WI VS NZ (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 18, 2024, 10:56 PM IST

WI vs NZ T20 World Cup Semis : 2024 మహిళల టీ20 వరల్డ్​కప్​లో న్యూజిలాండ్​ ఫైనల్​కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీస్​లో వెస్టిండీస్​పై కివీస్ 8పరుగుల తేడాతో నెగ్గింది. 129 పరుగుల ఛేదనలో దిగిన విండీస్​ 120-8 స్కోర్​కే పరిమితమైంది. దెయెంద్ర డొట్టిన్ (33 పరుగులు) మాత్రమే రాణించింది. కివీస్ బౌలర్లలో ఈడెన్ కార్సన్ 3, అమెలియా కేర్ 2, లియా, జోన్స్ చెరో 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 129-9 స్కోర్ చేసింది. జార్జియా ప్లిమ్మర్ (33 పరుగులు), సూజి బీట్స్ (26 పరుగులు), ఇసాబెల్లా గేజ్ (20 పరుగులు) ఫర్వాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో దెయెంద్ర డొట్టిన్ 4, ఫ్లెచర్ 2, కరిష్మ, అల్లియహ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

కాగా, ఇప్పటికే ఫైనల్​ చేరిన సౌతాఫ్రికాతో కివీస్ ఆదివారం టైటిల్ ఫైల్​లో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.