Nirmala Sitharaman Sports Budget 2024 : పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. క్రీడా రంగానికి సంబంధించి ఈ బడ్జెట్‌లో రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక ఏడాడితో పోల్చిస్తే ఈ బడ్జెట్‌లో రూ.45.36 కోట్లు మాత్రమే క్రీడలకు అదనంగా కేటాయించారు.
గ్రామీణస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియాకు అత్యధికంగా రూ.900 కోట్లు వెచ్చించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లకు రూ.340 కోట్లు, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కు రూ.22.30 కోట్లు, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డిటిఎల్)కు రూ.22 కోట్లు కేటాయించారు.