Bumrah T20 World Cup: టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా 2024 టీ20 వరల్డ్‌కప్‌లో జట్టు పేస్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత్ శనివారం బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో బుమ్రా తాజాగా ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. 'సిరాజ్, అర్ష్‌దీప్ లాంటి జూనియర్లకు ఏమైనా సలహాలు ఇస్తారా' అని ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 'ఎవరికైనా సరే ఎక్కువగా చెప్పకూడదు. కెరీర్లో నేను నేర్చుకున్నది ఇదే. ఎవరైనా సాయం కోసం నా దగ్గరకు వస్తే, వాళ్ల సందేహాలు వింటా. ఏదీ అడగకపోతే ఎక్కువగా చెప్పను. అలా చేస్తే వారిపై ఒత్తిడి పెంచినట్లవుతుంది. ఇప్పుడు అమెరికా వచ్చిన వారంతా అదృష్టవంతులే. ఇంటర్నేషనల్ లెవెల్లో నిరూపించుకోడానికి ఇదో చక్కటి అవకాశం. వారికి అవసరమైనంత సమాచారం ఇచ్చేందుకు నేను రెడీ. కెరీర్లో ముందుకెళ్లేకొద్ది వాళ్లూ నేర్చుకుంటారు. సొంతంగా సమస్యలను పరిష్కరించుకోగలరు' అని బుమ్రా అన్నాడు.
'ఏదైనా ఎక్కువగా చెప్పను- కెరీర్లో నేర్చుకున్నది ఇదే'
Published : Jun 1, 2024, 4:17 PM IST