T20 Worldcup 2026 Qualifying Teams : టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే పొట్టికప్ 2026 స్వరూపాన్ని ప్రకటించింది ఐసీసీ. ఈసారి కూడా రెండు ప్రాథమిక రౌండ్లు, నాకౌట్‌గా టోర్నీ సాగుతుందని చెప్పింది. 2024 తరహాలోనే 2026లోనూ 20 జట్లు పోటీపడనున్నాయి. అయితే వీటిలో మొత్తం 12 జట్లకు డైరెక్ట్‌గా అర్హత దక్కనుంది. ఆతిథ్యజట్ల హోదాలో భారత్, శ్రీలంకతోపాటు రన్నరప్ హోదాలో దక్షిణాఫ్రికాకు డైరెక్ట్‌గా ఛాన్స్ దక్కింది.
ఇక టీ20 వరల్డ్‌కప్ 2024లో సూపర్-8కు చేరిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, అమెరికా వచ్చే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హతసాధించాయి. ఈ సారి సూపర్-8కు చేరుకోని న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్థాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) కూడా జూన్ 30నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా వచ్చే వరల్డ్‌కప్‌నకు అర్హత దక్కించుకున్నాయి. మరో 8 జట్ల ఎంపిక కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు జరుగుతాయి.