T20 World Cup 2024: 2024 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్- 8లో నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉన్నా, ఒక్క జట్టుకు కూడా సెమీస్ బెర్తు ఖరారు కాలేదు. గ్రూప్- 1నుంచి భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ రేస్‌లో ఉండగా, గ్రూప్- 2నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ పోటీలో ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌లు ఇంగ్లాండ్- అమెరికా, సౌతాఫ్రితా- వెస్టిండీస్, గ్రూప్- 1లో భారత్- ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్- అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్నాయి.
గ్రూప్- 1లో భారత్ సెమీస్ చేరేందుకు భారత్‌కు దాదాపు 95శాతం ఛాన్స్ ఉంది. అటు సౌతాఫ్రికాకు కూడా సెమీస్ అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ రెండు జట్లు తమతమ ఆఖరి మ్యాచ్‌లో నెగ్గితే సెమీస్ చేరుకుంటాయి. ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక్కడ నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం 4జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది.