ETV Bharat / snippets

సౌతాఫ్రికా వరల్డ్​ రికార్డ్- భారత్, ఆసీస్​ను అధిగమించి!

author img

By ETV Bharat Sports Team

Published : Aug 18, 2024, 7:14 PM IST

SA vs WI
SA vs WI (Source: Getty Images)

SA vs WI Test Series: టెస్టు ఫార్మాట్​లో వెస్టిండీస్​పై సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. విండీస్​లో పర్యటిస్తున్న సౌతాఫ్రికా, తాజాగా ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో మ్యాచ్​లో 40 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-0 తేడాతో సఫారీ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్​ నెగ్గిన సౌతాఫ్రికా టెస్టుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. టెస్టుల్లో ఒకే ప్రత్యర్థిపై వరుసగా 10 సిరీస్​లు నెగ్గిన టీమ్​గా ఘనత సాధించింది.

కాగా, అంతకుముందు చెరో 9 విజయాలతో ఈ రికార్డ్ భారత్, ఆస్ట్రేలియా పేరిట ఉంది. అయితే భారత్, ఆసీస్ కూడా విండీస్​పైనే ఈ రికార్డు నెలకొల్పాయి. ఇక సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 33 టెస్టులు జరిగాయి. ఇందులో సఫారీ జట్టు మూడింట్లో మాత్రమే ఓడింది. ఈక్రమంలో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు (171) పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్​గా నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.