ETV Bharat / snippets

ఓడినా ఎంతో నేర్చుకున్నా- ఆమె నాకు స్ఫూర్తి: రమితా జిందాల్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 8:20 PM IST

Updated : Jul 29, 2024, 8:28 PM IST

Ramita Jindal
Ramita Jindal (Source: Associated Press)

Ramita Jindal Paris Olympics 2024: భారత యంగ్ షూటర్ రమితా జిందాల్​కు పారిస్ ఒలిపింక్స్​లో నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన 10మీటర్ల రైఫిల్ ఈవెంట్ ఫైనల్​లో జిందాల్ ఓడింది. పతక పోరులో ఆమె 7వ స్థానానికి పరిమితమైంది. అయితే కెరీర్​లో తొలిసారి ఒలింపిక్స్​లో పాల్గొన్న రమిత, అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది.

'విశ్వ క్రీడల్లో ఆడిన అనుభవం బాగుంది. ఇక్కడ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భవిష్యత్​లో మెరుగుపడేందుకు ఇది నాకు ఉపయోగపడుతుంది' అని రమిత తెలిపింది. ఇక కాంస్య పతకం సాధించిన మను బాకర్​ను రమిత అభినందించింది. 'మను చాలా కష్టపడుతుంది. నాతో పాటు ఆమె చాలా మందికి స్ఫూర్తి. ఈ విజయానికి ఆమె అర్హురాలే. తను పతకం నెగ్గిన తర్వాత నేనూ సాధించగలనన్న నమ్మకం పెరిగింది. ప్రస్తుతం మన అథ్లెట్లు ఫామ్​లో ఉన్నారు. మరిన్ని పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది' అని రమిత జిందాల్ పేర్కొంది.

Last Updated : Jul 29, 2024, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.