ETV Bharat / snippets

ఇట్స్ IPL టైమ్- రాజస్థాన్​కు​ కోచ్​గా ద్రవిడ్?

author img

By ETV Bharat Sports Team

Published : Sep 4, 2024, 4:31 PM IST

Rahul Dravid IPL 2025
Rahul Dravid IPL 2025 (Source: Getty Images)

Rahul Dravid RR Head Coach: టీమ్ఇండియా మాజీ హెడ్​కోచ్​ ఐపీఎల్​లో మళ్లీ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. 2025 ఐపీఎల్​లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు తుది దశకు చేరాయట. 2024 టీ20 వరల్డ్​కప్ వరకు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్‌ జూన్ 30 తర్వాత ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.

ఇక రానున్న సీజన్​ కోసం ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలనే అంశంపై త్వరలోనే రాజస్థాన్ రాయల్స్‌ యాజమాన్యంతో రాహుల్‌ ద్రవిడ్‌ కలిసి చర్చించనున్నట్లు సమాచారం. కాగా, రాజస్థాన్‌ రాయల్స్ జట్టుకు 2012, 2013 సీజన్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్‌ 2014, 2015లో మెంటర్‌గా పని చేశారు. 2016 నుంచి కొన్నాళ్ల పాటు దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మెంటర్‌గా వ్యవహరించిన ద్రవిడ్‌ 2021లో భారత క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.