ETV Bharat / snippets

పతకానికి అడుగు దూరంలో తెలుగు కుర్రాడు - 1972 తర్వాత ఆసీస్​పై భారత్​ విజయం

author img

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 7:06 PM IST

source Associated Press
Paris Olympics 2024 (source Associated Press)

Paris Olympics 2024 Archery Dhiraj Bommadevara : పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌ ద్వయం సెమీ ఫైనల్‌కు చేరింది. దీంతో వీరు పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. ఈ క్వార్టర్స్‌ ఫైనల్‌లో అంకిత, ధీరజ్‌ ధ్వయం 5-3 తేడాతో స్పెయిన్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌ పోరులో అంకిత, ధీరజ్‌ ధ్వయం ఇండోనేషియా ద్వయం ఆరిఫ్‌-కోరునిసాపై 5-1తో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు విజయం(Paris Olympics 2024 Indiahockey) - ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. పూల్‌ బి నుంచి ఇప్పటికే భారత్‌, బెల్జియం, ఆసీస్‌ క్వార్డర్‌ ఫైనల్​కు అర్హత సాధించాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.