Ind vs Pak T20 2024: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే స్టేడియంలో టికెట్ల ధరలు భగ్గుమంటాయి. దాయాదుల పోరుకు టికెట్ ధర ఎంత్తైనా, మ్యాచ్ జరిగేది ఏ దేశంలోనైనా కచ్చితంగా వెళ్లే ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. అచ్చం అలానే ఓ పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్ రీసెంట్గా జరిగిన ఇండోపాక్ మ్యాచ్ టికెట్ కోసం తన ట్రాక్టర్‌నే అమ్మేశాడు. మ్యాచ్ అనంతరం తనే ఈ విషయాన్ని మీడియాతో చెప్పాడు.'3వేల డాలర్ల ఖరీదైన టికెట్ కొనేందుకు నా ట్రాక్టర్ అమ్మేశాను. భారత్ స్కోర్ చూశాక మేం ఓడిపోతామని అస్సలు అనుకోలేదు. బాబర్ ఔట్ కాకముందు గేమ్ మా చేతుల్లోనే ఉంది. ఫలితం చూశాక మేం నిరాశ చెందాం. నెగ్గిన వారికి శుభాకాంక్షలు' అని అన్నాడు. ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై ఉన్న ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత్ మరోసారి సత్తా చాటింది. పొట్టికప్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా 6పరుగుల తేడాతో నెగ్గింది.
రూ.2లక్షల టికెట్ కోసం ట్రాక్టర్ అమ్మిన పాక్ ఫ్యాన్- పాపం మ్యాచ్ పోయిందిగా!
Published : Jun 10, 2024, 10:36 AM IST
|Updated : Jun 10, 2024, 11:12 AM IST