ETV Bharat / snippets

రచిన్​కు బంపర్ ఆఫర్ - సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్​లో చోటు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 2:37 PM IST

Source  Etv Bharat
Rachin Ravindra Central Contract (Source Etv Bharat)

Rachin Ravindra Central Contract : న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. 2024-25 ఏడాదికిగానూ న్యూజిలాండ్ సెంట్రల్ క్రాంట్రాక్ట్​ లిస్ట్​లో రచిన్ చోటు దక్కించుకున్నాడు. గతేడాది వన్డే వరల్డ్​కప్​లో నిలకడగా రాణించిన రచిన్ కివీస్​కు కీలక ప్లేయర్​గా మారాడు. ఆ టోర్నీలో 578 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాత కూడా కీవీస్ టీ20, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న రచిన్ నిలకడగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో కెరీర్ ప్రారంభించిన మూడేళ్లకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్​కు పొందాడు.

'ఇది నేను నమ్మలేకపోతున్నా. కెరీర్​లో ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో కివీస్​కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా' అని 24ఏళ్ల రచిన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న అనంతరం అన్నాడు. ఇక కెరీర్​లో 519టెస్టు, 820వన్డే, 231టీ20 పరుగులు సాధించాడు. 2024ఐపీఎల్​లో రచిన్​ను చెన్నై రూ.1.8కోట్లకు కొనుగోలు చేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.