Irfan Pathan Coach: 2024 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను గనక టీమ్ఇండియా కోచ్ అయ్యి ఉంటే ప్రతి బ్యాటర్ కచ్చితంగా బౌలింగ్ చేయాలన్న నిబంధన పెట్టేవాడని పేర్కొన్నాడు. 'నేను కోచ్ అయితే స్పెషలిస్ట్ బ్యాటర్లు అందరూ జట్టుకు అవసరమైనప్పుడు కచ్చితంగా బౌలింగ్ చేయాలి అనే రూల్ తీసుకొస్తా' అని అన్నాడు.
ఈ సందర్భంగా 2007, 2011లో టీమ్ఇండియా వరల్డ్‌కప్‌లు నెగ్గడంలో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషించినట్లు గుర్తుచేశాడు. అప్పటి జట్టులో సచిన్, యువరాజ్, రైనా బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ కూడా చేశారన్నాడు. ఇప్పుడున్న జట్టులో రోహిత్, విరాట్, సూర్య కేవలం బ్యాటింగే చేస్తారని, బౌలింగ్ చేయరని అన్నాడు. ఆ ముగ్గిరిలో ఒక్కరు బౌలింగ్ చేసినా జట్టుకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అలాగే 'ఇంగ్లాండ్‌లో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, జాక్స్ బ్యాటింగ్‌తోపాటు బంతితోనూ రాణిస్తారు'అని అన్నాడు.