Sunil Chhetri Last Match: భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఫిఫా 2026 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కువైట్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో 19ఏళ్ల ఛెత్రి కెరీర్ ముగిసింది. మ్యాచ్ అనంతరం ఛెత్రికి ప్రేక్షకులు గ్రాండ్‌గా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆ సమయంలో సునీల్ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుంటున్నట్లు ఛెత్రి ఇటీవల ప్రకటించాడు. 2005లో ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో కెరీర్ ప్రారంభించిన ఛెత్రి భారత్ తరఫున 95 గోల్స్ చేశాడు. కాగా, వరల్డ్‌వైడ్‌గా అత్యధిక గోల్స్ చేసిన లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో (128 గోల్స్), అలీ డే (108), మెస్సీ (106) తర్వాత ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు.
లాస్ట్ గేమ్ ఆడేసిన సునీల్ ఛెత్రి- 19ఏళ్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్
Published : Jun 6, 2024, 9:43 PM IST