ETV Bharat / snippets

ఫైనల్​లో రఫ్పాడించిన స్మృతి- లంక టార్గెట్ ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 5:10 PM IST

Ind vs SL
Ind vs SL (Source: Getty Images)

India W vs Sri Lanka W: మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్​లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (60 పరుగులు; 47 బంతుల్లో 10 x4) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (29 పరుగులు; 16 బంతుల్లో 3x4, 1x6), రిచా ఘోష్‌ (30 పరుగులు; 14 బంతుల్లో 4x4, 1x6) రాణించారు.

షఫాలీ వర్మ (16), ఉమా ఛెత్రి (9), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2, సచిని నిశంసల, చమరి ఆటపట్టు, ఉదేశిక ప్రబోధని ఒక్కో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.