ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత - నీట మునిగిన రైతన్నలు - చివరకు? - Farmers stuck in Flood water - FARMERS STUCK IN FLOOD WATER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 2:29 PM IST

Farmers and Cows Stuck In Flood Water In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం పెండల్‌ వాగులో భయానక పరిస్థితి ఎదురైంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో రైతులు, ఎద్దులు నీటిలో మునిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడింది. ఎగువన ఉన్న సాత్నాల ప్రాజెక్టు గేట్లను అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తడంతో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో చెరువు నుంచి దాటుకొని వస్తున్న రైతులు నీటిలో మునిగిపోయారు.

అతి కష్టం మీద రైతులు, ఎద్దులు బయటపడటంతో ప్రాణాలకు ప్రమాదం తప్పింది. సాగునీటి శాఖ యంత్రాంగం ఈ సంఘటన బయట పడకుండా ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో  పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలకు వరదలు వచ్చి పలు ప్రాంతాలు అతలాకుతలమైన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలుగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటిప్పుడు చర్యలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.