Best Cleaning Tips for Kitchen Slab : మనం వంటింట్లో తరచుగా ఉపయోగించే కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌ, సింక్.. వంటి వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే.. అసలే వర్షకాలం వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అయితే.. చాలా మంది గృహిణులు కిచెన్ ప్లాట్‌ఫామ్ క్లీనింగ్ కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు.
ఎందుకంటే.. నూనెల వల్ల దానిపై పడ్డ జిడ్డు మరకలు ఒక పట్టాన వదలవు. ఎన్నిసార్లు రుద్ది కడిగినా అవి అసలు పోవు. మీరూ ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నారా? అయితే, మీకోసం కొన్ని సింపుల్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అవుతూ కిచెన్(Kitchen) స్లాబ్ క్లీన్ చేసుకున్నారంటే ఈజీగా జిడ్డు మరకలు పోవడమే కాదు మీ వంటగది నిమిషాల్లో తళతళా మెరిసిపోతుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మరసం : కిచెన్ ప్లాట్‌ఫామ్, టైల్స్‌పై పడిన జిడ్డు మరకలను తొలగించడంలో నిమ్మరసం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఒక చిన్న బౌల్లో కొద్దిగా డిష్ వాష్ ద్రవాన్ని తీసుకొని అందులో సగం పచ్చ నిమ్మరసం పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమంలో స్క్రబ్బర్‌ను ముంచి చేతులతో పిండి చేతులతో పిండి అప్పుడు దానితో కిచెన్ ప్లాట్ఫ్లామ్ లేదా స్లాబ్ క్లీన్ చేసుకోవాలి.
తర్వాత నీటిలో నానబెట్టిన కాటన్ వస్త్రంతో మరోసారి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఆ ప్రదేశంలో ఉన్న లూబ్రికేషన్ ఈజీగా తొలగిపోయి నీట్‌గా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. డిష్ వాష్, నిమ్మరసం మిశ్రమం కిచెన్ సింక్, టైల్స్‌నూ శుభ్రపర్చడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు.
వెనిగర్ : ఇది వంటల టేస్ట్ పెంచడమే కాదు.. మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కిచెన్ ప్లాట్‌ఫామ్, ఇంటి ఫ్లోర్‌పై ఉండే మరకలను క్లీన్ చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం.. ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, రెండు చెంచాల వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని స్ర్పే బాటిలో పోసుకొని క్లీనింగ్ కోసం యూజ్ చేయండి. దీనితో.. ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే తొలగిపోతాయంటున్నారు నిపుణులు.
బేకింగ్ సోడా : కిచెన్ స్లాబ్‌పై పడిన నూనె మరకలను పోగొట్టడంలో ఇది చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ఒక బౌల్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, సగం పచ్చ నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి. ఆపై దాన్ని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకొని జిడ్డు మరకలు ఉన్న చోట కొద్దిగా అప్లై చేసి బ్రష్‌తో రుద్ది కడుక్కుంటే సరిపోతుంది. ఎలాంటి మొండి మరకలైనా ఈజీగా మాయమవుతాయంటున్నారు.
అలాగే.. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఆయిల్ మరకలు పడిన వెంటనే తుడుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా అవి జిడ్డుగా మారవు. లేదంటే.. అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు అవి మొండి మరకలుగా మారిపోతాయి. కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
తుప్పు, జిడ్డు మరకలతో ట్యాప్స్ అసహ్యంగా ఉన్నాయా? - ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి!
స్టెయిన్లెస్ స్టీల్ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా!