ETV Bharat / snippets

భయం లేదు, ఇలానే ముందుకెళ్తాం! : సూర్యకుమార్ యాదవ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 8:58 AM IST

source Associated Press
IND VS SL T20 Series Suryakumar yadav (source Associated Press)

IND VS SL T20 Series Suryakumar yadav : లంకతో మూడు టీ20లసిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమ్​ఇండియా దక్కించుకుంది. గౌతమ్​గంభీర్‌ కోచ్‌గా, సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 టీమ్​ కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాక జరిగిన తొలి సిరీస్‌నే సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా కెప్టెన్‌ సూర్య మాట్లాడాడు. "ఇకపై షార్ట్​ ఫార్మాట్‌లో పాజిటివ్​​ థింకింగ్​, భయంలేని ఆటతీరుతో ముందుకు వెళ్తామని అన్నాడు. మేం ఎలాఆడాలని అనుకున్నామో టోర్నీ ముందే చెప్పాం. ఇదే ధోరణితో ముందుకు వెళ్తాం. వాతావరణాన్ని చూశాక లంకను 160 పరుగుల కన్నా తక్కువకే కట్టడి చేయాలని అనుకున్నాం. అందుకు తగ్గట్టే బౌలర్లు రాణించారు. వర్షం రావడం కలిసొచ్చింది. బ్యాటర్ల ఆటతీరు సూపర్. ఇప్పటి వరకు బెంచ్‌కు పరిమితమైన వాళ్లను తర్వాతి మ్యాచ్‌లో ఆడించడంపై డెసిషన్ తీసుకోవాలి" అని సూర్యకుమార్‌ అన్నాడు. రెండు మ్యాచుల్లోనూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య సిరీస్‌ను దక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.