ETV Bharat / snippets

రిటైర్మెంట్ ప్రకటించిన 'హాకీ రాణి' - 29ఏళ్లకే కెరీర్​కు గుడ్​బై

Rani Rampal retirement
Rani Rampal retirement (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 24, 2024, 3:20 PM IST

Rani Rampal Announces Retirement: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది. కెరీర్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆటకు గుడ్​బై చెప్పిన 30ఏళ్ల రాణి రాంపాల్, మహిళల హాకీ లీగ్ ఇండియా​లో సూర్మ (హరియాణా) జట్టుకు కోచ్​గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది.

కాగా, 14ఏళ్ల వయసులోనే భారత్ తరఫున 2008లో రాణి అరంగేట్రం చేసింది. దీంతో భారత్ తరఫున మహిళల హాకీలో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. 16ఏళ్ల తన కెరీర్​లో రాణి ఇప్పటివరకు 250 మ్యాచ్​ల్లో ఆడింది. అన్నింట్లో కలిపి 130 గోల్స్ సాధించింది. తన నాయకత్వంలో 2020 టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న టీమ్ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక రాణి 2016లో అర్జునా అవార్డు, 2020లో పద్శ శ్రీ అవార్డులు దక్కించుకుంది. అదే 2020లో మేజర్ ధ్యాన్​చంద్ ఖేల్​రత్న అవార్డు సైతం దక్కింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.