ETV Bharat / snippets

'స్పెయిన్​'దే యూరో కప్- ఇంగ్లాండ్​కు మళ్లీ నిరాశే

Euro Cup 2024
Euro Cup 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 6:40 AM IST

Updated : Jul 15, 2024, 8:38 AM IST

Euro Cup 2024: 2024 యూరో కప్​లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఆదివారం ఇంగ్లాండ్​తో జరిగిన ఫైనల్​లో స్పెయిన్ 2-1 తేడాతో నెగ్గి నాలుగో యూరో కప్ టైటిల్​ గెలుచుకుంది.​ కాగా, ఇంగ్లాండ్ వరుసగా రెండోసారి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఈటోర్నీలో అజేయంగా ఫైనల్​కు దూసుకువచ్చిన స్పెయిన్ హోరాహోరీగా సాగిన తుదిపోరులోనూ అదరగొట్టింది. మ్యాచ్​లో ఫస్ట్​ హాఫ్​లో ఇరుజట్లు కూడా గోల్ కొట్టలేకపోయాయి.

ఇక సెకండ్ హాఫ్​లో రెండో నిమిషంలోనే స్పెయిన్‌ గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. స్పెయిన్​ ప్లేయర్ నికో విలియమ్స్‌ అద్భుత గోల్‌తో తన జట్టు ఖాతా తెరిచాడు. 73 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌ ఆటగాడు కోలె పాల్‌మెర్‌ గోల్‌ కొట్టడం వల్ల ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. 86వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు మైకెల్‌ ఒయార్జాబల్‌ కొట్టిన గోల్​తో స్పెయిన్ లీడ్​లోకి వెళ్లింది. ఇక అదనపు సమయంలో ఇంగ్లాండ్‌ గోల్‌ చేయలేకపోవడం వల్ల స్పెయిన్‌ విజేతగా నిలిచింది.

Last Updated : Jul 15, 2024, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.