2024 Womens T20 World Cup: 2024 మహిళల టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే విద్యార్థుల ఆందోళన వల్ల అక్కడ పరిస్థితులను బట్టి బంగ్లాలో టోర్నీ జరగడం అసాధ్యం! ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వడానికి రెడీ అవుతుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ సెక్రటరీ జై షా తోసిపుచ్చారు. మహిళల వరల్డ్‌కప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం లేదంటూ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్నందున రెండు టోర్నీలకు హోస్టింగ్ చేయలేమని జైషా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక భారత్ హోస్టింగ్ రేస్‌లో లేనందున ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీ యూఏఈ లేదా శ్రీలంకలో జరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండింట్లో ఏదో ఒక దేశం ఆతిథ్య హక్కులు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అక్టోబర్ 03 నుంచి 20 దాకా ఈ టోర్నీ జరగాల్సి ఉంది.