Bajrang Punia Suspension : రెజ్లింగ్ స్టార్ బజరంగ్ పునియాపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా 'నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ' బజరంగ్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అయితే నెల క్రితమే ఆయనపై తొలిసారి వేటుపడగా, ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా ఆ వేటును క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. ఆ తర్వాత ఇటీవలె నోటీసులు ఇచ్చిన నాడా తాజాగా చర్యలకు ఉపక్రమించింది.
ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనే ప్లేయర్లపై దేశీయంగా నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో
భాగంగానే మార్చి 10న బజరంగ్ పునియా నుంచి డోపింగ్ ఏజన్సీ మూత్ర నమూనాలను కోరింది. అయితే ఆయన వారికి ఆ శాంపిల్‌ను అందించలేదని తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ బజరంగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో జులై 11లోగా ఈ విషయంపై ఆయన స్పందించాలని ఆదేశించింది.