Hardik Natasa Divorce News : టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్‌పాండ్య తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఈ జంట ఎటువంటి సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ నటాషా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
"లైఫ్‌లో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. నిరుత్సాహపడతాం. అలాంటప్పుడు ఎవరూ తోడుగా లేరని బాధ పడకూడదు. అన్నింటికీ ఆ దేవుడే తోడుంటాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దానిగురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది" అంటూ నటాషా వీడియోను పోస్టు చేసింది. కాగా, రీసెంట్గా నటాషా తన ఇన్‌స్టాలో హార్దిక్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను డిలీట్ చేసింది. కేవలం కుమారుడితో ఇద్దరూ ఉన్న చిత్రాలను మాత్రమే ఉంచింది. దీంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి.