ETV Bharat / snippets

వింబుల్డన్​ ఫైనల్​కు జకోవిచ్, అల్కరాస్- పంతం నీదా నాదా సై!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 11:04 AM IST

Alcaraz vs Djokovic 2024
Alcaraz vs Djokovic 2024 (Source: Associated Press)

Alcaraz vs Djokovic 2024: 2024 వింబుల్డన్ ఆఖరి దశకు చేరుకుంది. అందరూ ఆశించినట్లే అత్యుత్తమ ఆటగాళ్లే టైటిల్ పోరులో నిలిచారు. జులై 14న నొవాక్ జకోవిచ్ (సెర్బియా)- అల్కరాస్‌ (స్పెయిన్) ఫైనల్​ ఫైట్​లో తలపడనున్నారు. 7సార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్, గతేడాది విజేత కార్లోస్‌ అల్కరాస్‌ అదిరే ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చారు. మరి జకోవిచ్ 8వ వింబుల్డన్​ టైటిల్ నెగ్గుతాడా? అల్కరాస్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలుపుకుంటాడా? అనేది ఆదివారం తేలిపోనుంది.

ఈ స్టార్ ప్లేయర్లు ఇప్పటిదాకా 5ఈవెంట్లలో తలపడ్డారు. ఈ 5సార్లు కూడా ఇద్దరి మధ్య టఫ్​ఫైట్ జరిగింది. కాగా, అందులో 3సార్లు జకోవిచ్ నెగ్గగా, 2సార్లు అల్కరాస్​ విజయం సాధించాడు. ఇక వింబుల్డన్​లో గతేడాది కూడా ఈ ఇద్దరి మధ్యే ఫైనల్ జరిగింది. ఇందులో 7సార్లు ఛాంపియన్ జకోవిచ్​పై 1-6, 7-6, 6-1, 3-6, 6-4తేడాతో అల్కరాస్​ తొలిసారి టైటిల్ ముద్దాడాడు. మరి ఈసారి ఎవరిది పైచేయి కానుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.