KTR Comments on Cm Revanth: సుంకిశాల ఘటనకు కారణమైన మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అప్పగించేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సుంకిశాల ఘటనకు కారణమైన కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఇవాళ మేఘా సంస్థపై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆసక్తిపై ఆంతర్యం ఏంటో చెప్పాలని కేటీఆర్ అడిగారు.
సుంకిశాల ఘటన విషయంలో మేఘాపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్
Published : Aug 20, 2024, 11:40 AM IST