Kodela Sivaram: ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలని కోడెల శివరాం ఓ డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లి, లోటస్‌పాండ్‌లో ఇళ్ల మరమ్మతుల కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం జగన్ తన నివాసంలో సీఎంవో కింద తెచ్చిన ఫర్నిచర్ ఇచ్చేస్తానని కనీసం లేఖ రాయలేదు. ఇప్పటిదాక ఫర్నిచర్ ఇవ్వనందుకు కోడెలపై పెట్టిన కేసే జగన్ మీద పెట్టొచ్చు కదా! అని ప్రశ్నించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరోజు ఫర్నిచర్ తన వద్ద ఉందని చెప్పకపోతే ఎవరికీ తెలియదని, ఫర్నిచర్ తీసుకెళ్లాలని స్పీకర్‌కు లేఖ రాసిన తర్వాత ఆయనపై కేసు పెట్టారు. ఐపీసీ 409 సెక్షన్ కింద పదేళ్లు శిక్షపడే కేసు పెట్టారని కోడెల శివరాం గుర్తుచేశారు. జగన్ పై సైతం అదే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
కోడెల శివప్రసాద్‌పై పెట్టిన కేసే జగన్ మీద పెట్టాలి: కోడెల శివరాం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 7:38 PM IST