ETV Bharat / snippets

ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం - ఆ అంశాలపై చర్చ!

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 7:00 PM IST

BJP
BJP State Executive Meeting (ETV Bharat)

BJP State Executive Meeting : బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 12న జరగనుంది. శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ పార్టీ సంస్థాగత జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, బీజేపీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాద తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేయనున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.