ETV Bharat / snippets

ఆన్‌లైన్ బెట్టింగులతో రూ.2 కోట్ల అప్పు - తీర్చలేక కాలువలో దూకి ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 1:58 PM IST

ONLINE BETTING
young man Sucide in Nalgonda disrtict (ETV Bharat)

Nalgonda disrtict young man Sucide: నల్గొండ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో రూ.2 కోట్ల అప్పు చేసిన యువకుడు, వాటిని తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాలియా వద్ద సాగర్ ఎడమ కాలువలో దూకి సూర్యాపేట జిల్లా దోసపహాడ్ వద్ద ఎడమ కాలువలో శవమై తేలాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడిని నల్గొండ జిల్లా కేంద్రం నెహ్రూ నగర్‌కు చెందిన తడకమల్ల సాయి కుమార్‌గా గుర్తించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.2 కోట్లు అప్పులు చేసిన సాయి కుమార్, వాటిని తీర్చలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడి ఆచూకీపై కుటుంబ సభ్యులు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హాలియా సాగర్ ఎడమ కాలువ సమీపంలో సెల్ ఫోన్ సిగ్నల్‌ను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.