US Israel Weapons Deal : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. అందులో అనేక ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, 120 ఎమ్ఎమ్ ట్యాంక్ మందుగుండు సామగ్రి, అధిక పేలుడు మోర్టార్లు ఉన్నాయి.
అయితే ఈ ఆయుధాలన్నీ ఎప్పుడు ఇజ్రాయెల్‌కు చేరుకుంటాయనేది తెలియలేదు. వీటన్నింటినీ ఇజ్రాయెల్‌కు అప్పగించడానికి కొన్నేళ్లు పట్టనున్నట్లు సమాచారం. అమెరికా ఇవ్వనున్న ఈ ఆయుధాలు ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యాన్ని దీర్ఘకాలికంగా పెంచుకోవడానికి సాయపడుతుంది. కాగా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న ఇరాన్, దాడికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధ విక్రయ ఒప్పందానికి అమెరికా ఆమోదించడం గమనార్హం.