Ukraine Claims Russian Submarine Sunk : ఉక్రెయిన్ శుక్రవారం రాత్రి తమ భూభాగాలపై డ్రోన్లతో దాడి చేసిందని రష్యా రక్షణ శాఖ శనివారం తెలిపింది. అయితే తమ గగనతల రక్షణ వ్యవస్థలు దాదాపు 75 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని ప్రకటించింది. ఒక డ్రోన్‌ను అజోవ్ సముద్రంలో కూల్చేశామని, రొస్తోవ్ ప్రాంతంపై 55 డ్రోన్లు దండెత్తగా వాటిలో 36 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది. మరోవైపు రొస్తోవ్, బెల్గొరద్, కుర్‌స్క్‌లలో చమురు డిపోనూ, మందుగుండు గిడ్డంగులనూ, మోరొజోవ్స్క్లో ఒక వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ శనివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. చమురు డిపోపై దాడి జరిగిన మాట నిజమే కానీ, మంటలను వెంటనే ఆర్పివేశామని రష్యా తెలిపింది. మరోవైపు, క్రిమియాలోని సెవస్తొపోల్ నౌకాశ్రయంలో శత్రు దేశానికి చెందిన ఓ జలాంతర్గామిని ముంచేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఆ సబ్‌మెరైన్ నల్ల సముద్రం అడుగుకు పడిపోయినట్లు వెల్లడించింది.
ఉక్రెయిన్ దాడితో - రష్యా జలాంతర్గామి మునక!
Published : Aug 4, 2024, 6:44 AM IST