Bangladesh Tensions : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన గొడవల్లో మరణించిన బాధితులకు న్యాయం చేయాలంటూ దేశ రాజధాని ఢాకాలోని ప్రధాన వీధులను ఆందోళనకారులు దిగ్బంధించారు. శుక్రవారం జరిగిన ఆందోళనల సందర్భంగా ఇద్దరు మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. దీంతో చర్చలకు తన అధికారిక నివాసానికి రావాల్సిందిగా ఉద్యమకారులకు ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆ ఆహ్వానాన్ని తోసిపుచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలకు దిగారు. దీనితో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సీనియర్ టీచర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో ప్రధాని హసీనా శనివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. మరోవైపు, ఆందోళనలను ఆపేది లేదని స్పష్టం చేసిన విద్యార్థులు, ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని రాజీనామా చేయాలంటూ మరికొందరు డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు - నేటి నుంచి శాసనోల్లంఘన ఉద్యమం!
Published : Aug 4, 2024, 7:02 AM IST