ETV Bharat / snippets

క్రాష్​ అయిన మిస్సింగ్ హెలికాప్టర్​- 22మంది దుర్మరణం! ప్రమాదానికి కారణం అదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 4:40 PM IST

Russia Helicopter Accident
Russia Helicopter Accident (Associated Press)

Russia Helicopter Accident : రష్యాలో శనివారం 22 మందితో ప్రయాణిస్తూ మిస్సైన హెలికాప్టర్​ను రెస్క్యూ సిబ్బంది ఆదివారం గుర్తించారు. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

MI-8 హెలికాప్టర్​ ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేశారు. ఈ MI-8 శ్రేణికి చెందిన డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ను 1960ల్లో రూపొందించారు. దీన్ని రష్యాతోపాటు చుట్టు పక్కల దేశాలు ఎక్కువగా వినియోగిస్తుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.