ETV Bharat / snippets

అమెరికా రిపోర్టర్‌ను దోషిగా తేల్చిన రష్యా కోర్టు- 1986 తర్వాత తొలిసారి!

Russia Convicts US Journalist
Russia Convicts US Journalist (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 10:49 PM IST

Russia Convicts US Journalist : గూఢచర్యం ఆరోపణలపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ను రష్యా కోర్టు దోషిగా తేల్చింది. అతడికి 16 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, అమెరికా ప్రభుత్వం మోసంగా అభివర్ణించాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ గెర్ష్‌ కోవిచ్‌ను యెకాటెరిన్‌బర్గ్‌లో గతేడాది మార్చిలో రష్యా అదుపులోకి తీసుకుంది. అమెరికా కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపింది. అప్పటి నుంచి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ జైల్లో ఉన్నారు. 1986లో నికోలస్ డానిలోఫ్‌ తర్వాత రష్యా మొదటిసారి అమెరికా రిపోర్టర్‌పై గూఢచర్యం ఆరోపణలు మోపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.