ETV Bharat / snippets

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడి- 24మంది మృతి- ప్రతీకారం తప్పదని జెలెన్​స్కీ వార్నింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 5:14 PM IST

Russia Attack On Ukraine
Russia Attack On Ukraine (AssociatedPress)

Russia Attack On Ukraine : ఉక్రెయిన్‌లో రాజధాని కీవ్‌ సహా ఐదు నగరాలు లక్ష్యంగా పట్టపగలే రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. రష్యా భీకర దాడిలో ఉక్రెయిన్‌లో 24మంది మృతిచెందారు. అనేక మందికి గాయాలయ్యాయి. కీవ్‌లో ఉన్న అతిపెద్ద చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా క్షిపణులు పడ్డాయి. ఈ దాడిలో ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతింది. కీవ్‌పై జరిగిన దాడిలో 10మంది, మరో నగరం క్రైవీ రిహ్‌లో 10మంది మరణించారు. పోక్రోవ్స్క్‌లో ముగ్గురు, డ్నిపోలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

అత్యాధునిక ఆయుధాల్లో ఒకటిగా భావిస్తున్న కింజల్ హైపర్సోనిక్ క్షిపణులను ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించింది. శబ్ధం వేగం కంటే 10రెట్ల వేగంతో ఈ క్షిపణులు పయనిస్తాయి. వీటిని మధ్యలోనే అడ్డుకోవడం కష్టసాధ్యంగా ఉంటుంది. ఉక్రెయిన్‌లోని 5నగరాలను లక్ష్యంగా రష్యా 40క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. జనావాసాలపై దాడి చేసిన రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.