Festive Season Online Sales: దసరా, దీపావళి పండగల వేళ ఆన్‌లైన్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు తీసుకొచ్చిన ఫెస్టివ్ సేల్స్‌లో పెద్దఎత్తున సేల్స్ నమోదవుతున్నాయి. వీటిలో స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ముందు వరుసలో నిలుస్తున్నాయి. సెప్టెంబర్ 26న ఈ రెండు కంపెనీలు సేల్స్ మొదలుపెట్టగా తొలి వారంలోనే (అక్టోబర్ 2 వరకు) సుమారు రూ.54వేల కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు డాటుమ్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ నివేదిక పేర్కొంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మరికొన్ని రోజుల పాటు ఈ సేల్స్ కొనసాగనున్నాయి.
గతేడాదితో పోలిస్తే తొలి వారంలో విక్రయాలు 26 శాతం మేర పెరిగినట్లు సదరు నివేదిక తెలిపింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 60 శాతం వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే కావడం గమనార్హం. వీటిల్లో మొబైల్ ఫోన్ల వాటా 38 శాతం కాగా.. ఇతర ఎలక్ట్రానిక్, కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా 21 శాతంగా ఉంది. ఈ సేల్స్‌లో ఐఫోన్ 15తో పాటు, పాత ఐఫోన్ మోడళ్లకు మంచి గిరాకీ ఏర్పడినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ ధరలో తీసుకొచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ ఫోన్‌కు సైతం మంచి డిమాండ్ నెలకొందని పేర్కొంటున్నారు.
సిటీల నుంచే ఎక్కువ ఆర్డర్స్:
- ఈ పండగ సీజన్‌లో ప్రీమియం మొబైల్స్‌పై పెద్దఎత్తున డిస్కౌంట్స్ లభిస్తాయి.
- ఈ కారణంగానే చాలామంది ఈ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు.
- ముఖ్యంగా 30 వేల రూపాయల పైబడి ధర ఉన్న మొబైల్స్‌కు ఈ సేల్స్‌లో ఎక్కువ డిమాండ్ ఉందని నివేదిక చెబుతోంది.
- దీంతోపాటు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీలు మంచి విక్రయాలు నమోదు చేసినట్లు తెలిసింది.
- సగానికంటే ఎక్కువమంది EMIని పేమెంట్ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారన్నది మరో ఆసక్తికర అంశం.
- పైగా చిన్నచిన్న పట్టణాలు, నగరాల నుంచే ఎక్కువ ఆర్డర్స్ వస్తుండడం గమనార్హం.
- అమెజాన్.. తమ వేదికపై జరిగిన 70 శాతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ టైర్-2, టైర్-3 నగరాల నుంచి వచ్చినట్లు వెల్లడించింది.
- అలాగే TV సేల్స్ కూడా 80 శాతం ఆయా నగరాల నుంచే వచ్చినట్లు అమెజాన్ తెలిపింది.
- మొత్తంగా ఈ ఫెస్టివ్ సీజన్‌లో సేల్స్ దాదాపు రూ.లక్ష కోట్లకు చేరుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
- గతేడాది ఈ మొత్తం దాదాపు రూ.81 వేల కోట్లుగా ఉంది.
భారత్‌లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్- ఎక్కడెక్కడో తెలుసా? - Apple Stores in India