Road Accident In Peru : దక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడి 26 మంది మరణించగా, మరో 14మంది గాయపడ్డారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరింది. రాజధాని లిమా నుంచి 40మందికి పైగా ప్రయాణికులతో ఆండియన్కు వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను సమీప ఆసుపత్రికి తరలించారు. పర్వత రోడ్లపై వేగంగా వెళ్లడం, రోడ్లు చాలా దారుణంగా ఉండడం, ట్రాఫిక్ సంకేతాలు లేకపోవడం మొదలైన కారణాల వల్ల పెరూలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పెరూలో ఏకంగా 3,100 మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.
లోయలో పడ్డ బస్సు - 26 మంది మృతి, మరో 14 మందికి తీవ్రగాయాలు!
Published : Jul 17, 2024, 7:01 AM IST