Nepal New Prime Minister : చైనా అనుకూలవాది!, CPN-UML చైర్మన్ కేపీ శర్మ ఓలీను నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76-2 ప్రకారం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఓలీని కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. నాలుగోసారి ప్రధానిగా నియమితులైన ఓలీ, మంత్రివర్గంతో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల, నేపాల్ ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.
నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, పాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ప్రచండ, ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలికి చెందిన పార్టీ సీపీఎన్-యుఎంఎల్ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కూలింది. యుఎంఎల్, నేపాల్ కాంగ్రెస్ పార్టీ కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.