ETV Bharat / snippets

జస్టిన్ ట్రూడోకు బిగ్​ షాక్​! ​జగ్మీత్​ సింగ్ నో సపోర్ట్​- ముందస్తు ఎన్నికలకు విపక్షాలు పట్టు!

Justin Trudeau Government
Justin Trudeau Government (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 4:47 PM IST

Justin Trudeau Government : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. లిబరల్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు కీలక మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం జగ్మీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

జస్టిన్ ట్రూడో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారారని జగ్మీత్ విమర్శించారు. కార్పొరేట్ అనుకుల విధానాలు ప్రజలను నిరాశపరిచాయని ఆరోపించారు. ఈ విషయాన్ని ట్రూడో పదే పదే రుజువు చేశారని అన్నారు. ''ట్రూడో ప్రజలను నిరాశపరిచారు. కెనడియన్ల ఆయనకు మరో అవకాశం ఇవ్వరు. సంపన్నులకు, సీఈఓలకు దోచిపెట్టడానికి, కార్మికులు, రిటైర్డ్​ ఉద్యోగులు, యువకులు, రోగుల కుటుంబాల నుంచి ఎక్కువగా దోచుకుంటున్నారు'' అని జగ్మీత్ సింగ్ ఆరోపణలు గుప్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.